నాలుగో రోజూ పార్లమెంటు వాయిదా
న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి. దీంతో పార్లమెంటు ఉభయ సభలు వరుసగా నాలుగో రోజు వాయిదా పడ్డాయి.నరేంద్ర మోడి విషయమై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదాలు జరిగాయి.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నరేంద్ర మోడి ఉద్వాసనకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాల సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. దీంతో చైర్మన్ కృష్ణకాంత్ సభను శుక్రవారం నాటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications
