ఎమ్మెల్యే ఇంద్రసేన్ బంధువు హత్య
హైదరాబాద్: బిజెపి శాసనసభా పక్ష నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి తోడల్లుడుపి. నర్సింహా రెడ్డి (45)ని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. నర్సింహా రెడ్డి ఆస్మాన్‌ఘడ్‌లోని తన నివాసానికి వెళ్తుండగా ఈ హత్య జరిగింది.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసు కమిషనర్‌ఎం.వి. కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నర్సింహా రెడ్డి ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగుల సహకార బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శాసనసభ్యుడు ఇంద్రసేనా రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications
