హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్
అందిస్తున్న
ఇ-
సేవలను
ప్రపంచబ్యాంక్
ప్రతినిధి
బృందం
ప్రశంసించింది.
ప్రపంచ
బ్యాంక్
ప్రతినిధులు
రాష్ట్రంలోని
ఇ-
సేవా
కేంద్రాలను
బుధవారం
పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
ఇన్‌ఫర్మేషన్
టెక్నాలజీలో
కొత్త
ఒరవడినిపెట్టిందని
వారు
కొనియాడారు.
ఐటి
ద్వారా
పౌరులకు
ఏ
విధమైనసేవలు
అందివచ్చునో,
ప్రయివేట్
భాగస్వామ్యంతో
వాటిని
ఎంత
సమర్థంగా
నిర్వహించవచ్చునో
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం
నిరూపించిందని
వారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని
ఇ-సేవలను
ఇతర
దేశాలకు
ఉదాహరణగా
చూపవచ్చునని
వారు
అభిప్రాయపడ్డారు.