ప్రత్యేక ప్యాకేజీకి తెలుగుదేశం డిమాండ్
న్యూఢిల్లీ: నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని తెలుగుదేశం సభ్యుడు సి. రామచంద్రయ్య బుధవారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. లొంగిపోయిన నక్సల్స్‌కు పునరావాసం కల్పిస్తుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని, ఇందుకు కేంద్రం నుంచి తగిన సహాయం అవసరమని ఆయన అన్నారు.
నక్సల్స్ సమస్యను సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణిస్తున్నామని, నక్సల్స్ సమస్యల పరిష్కారానికి ఒక సమన్వయ విభాగం ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పంపితే,సెల్ దాన్ని పరిశీలించి, ప్రణాళికా సంఘానికి పంపుతుందని హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర రావు చెప్పారు.












Click it and Unblock the Notifications
