చర్చలకు హురియత్‌విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కాశ్మీరీలతో చిత్తశుద్ధితో చర్చలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని హురియత్‌ కాన్ఫరెన్స్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రాతినిధ్యానికి, పాలనకు ఎన్నికలు వంటి అంశాలు కూడా సంప్రదింపుల ప్రక్రియల్లో వుండవచ్చునని హురియత్‌ కాన్ఫరెన్స్‌ అన్నది. ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి జమ్మూ పర్యటన నేపథ్యంలో హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఈ విజ్ఞప్తిచేసింది.

కాశ్మీర్‌ సమస్యకుశాశ్వత పరిష్కారం కనుక్కోవాలనుకుంటే ఈ ఏడాదిఅక్టోబర్‌లో జరగనున్న ఎన్నికలు అంత ప్రాధాన్యం కాదని హురియత్‌ కాన్ఫరెన్స్‌ అన్నది. చర్చలకు చొరవ చూపాల్సింది భారత ప్రభుత్వమేనని హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధికార ప్రతినిధి అబ్దుల్‌ మజీద్‌ బాండే అన్నారు. చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం కావాలని తమ సంస్థ మొదటి నుంచీ కోరకుంటోందని ఆయన అన్నారు. చర్చలకు ముందు ప్రభుత్వం తన ఉద్దేశాలను ముందు పెట్టకూడదని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికలనేవి రోటీన్‌ వ్యవహారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం చూపబోవని, చర్చల ప్రక్రియ ప్రారంభమైతే వాటిని వాయిదా వేయవచ్చునని ఆయన అన్నారు. చర్చల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని, ఇందుకు ఇప్పుడు తగిన సమయమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+