సరిహద్దులో నిరవధికంగా కాల్పులు

హైదరాబాద్‌:సెట్విన్‌ బస్సును లారీ ఢీకొట్టడంతో 13 మంది దుర్మరణం పాలయ్యారు. ఈఘోర ప్రమాదం నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్లితే- నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని లక్ష్మీతండాలోని 60 కుటుంబాల నుంచి ఒకరిద్దరు చొప్పున 70 మంది మాల్‌లోని వేణగోపాలస్వామి ఆలయానికి సోమవారం సెట్విన్‌ బస్సులో బయలుదేరారు. కుర్‌మేయర్‌ గేటుకుఅర కిలోమీటరు దూరంలో ఎదురుగా శరవేగంతో వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దాంతో బస్సు రెండు పల్టీలు కొట్టి బోల్తా పడింది. బస్సు ప్రయాణికుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో 16 మంది పిల్లలు, 20 మందిస్త్రీలు ఉన్నారు. గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో తొమ్మిది మరణించారు.

ప్రమాదస్థలి హాహాకారాలతో మృత్యుకుహరంలా కనిపించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మంత్రి ఉమామాధవరెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డారు. గాయపడిన ముగ్గురు పిల్లలను ఉస్మానియా ఆస్పత్రిలో పట్టించుకునేవారు లేక మృత్యువాత పడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+