పాక్‌ది పాత పాటే: భారత్
న్యూఢిల్లీ: చర్చలకు పాకిస్థాన్ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని, సమస్యలపై పునరాలోచన చేయడం లేదని భారత్‌విమర్శించింది. భారత్‌పై పాత పాటే పాడుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నిరుపమా రావు శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
పాకిస్థాన్ నుంచి చొరబాట్లు తగ్గాయని, అయితేసైనిక మోహరింపుల ఉపసంహరణ గురించి నిర్ణయం తీసుకోవడం తొందరపాటే అవుతుందని, చొరబాట్లను ఆపేయాలని తాము చేస్తున్న డిమాండ్, సీమాంతర ఉగ్రవాదానికి అంతం పలుకడం, ఉగ్రవాదాల మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టడం వంటివిషయాల్లో పాకిస్థాన్ చేయాల్సింది ఇంకా చాలా వున్నదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
