వెంకయ్యకు పార్టీ పగ్గాలు ఖాయం

న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిఎం. వెంకయ్యనాయుడుకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమైనట్లు సమాచారం. వెంకయ్యనాయుడు పార్టీ అధ్యక్ష పదవి చేపడితే జనా కృష్ణమూర్తిని మంత్రి వర్గంలోకి తీసుకుని ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖనుఅప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి శనివారం సీనియర్‌ మంత్రులతో రెండు గంటల పాటు పార్టీలో, మంత్రి వర్గంలో చేయాల్సిన మార్పులపై చర్చించారు.సీనియర్‌ మంత్రులతో ప్రధాని ఈ విషయాలు చర్చించడం ఇదే మూడోసారి. చివరగా మరోసారి ఆయన సీనియర్‌ మంత్రులతో మాట్లాడుతారని సమాచారం.

ఉప ప్రధాని నియామకంపై ప్రధాని ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రుల్లో ముగ్గురు లేదా నలుగురిని తప్పించి వారికి పార్టీ బాధ్యతలుఅప్పగిస్తారు. వీరి స్థానంలో కొత్తవారికి స్థానం లభిస్తుంది. శతృఘ్న సిన్హా, కేశూభాయ్‌ పటేల్‌,వి.కె. మల్హోత్రా, సాహిబ్‌ సింగ్‌ వర్మలకు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలున్నాయి. వెంకయ్యనాయుడికే కాకుండా న్యాయ శాఖ మంత్రిఅరుణ్‌ జైట్లీకి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్‌కు పార్టీ బాధ్యతలుఅప్పగించే అవకాశాలున్నాయి.

మిత్రపక్షాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీకి, పిఎంకె నుంచి ఇద్దరికి మంత్రి వర్గంలో చోటు కల్పించాలని ప్రధాని ఆలోచిస్తున్నారు. మమతా బెనర్జీరైల్వే శాఖను అడిగితే సమస్య
ఎదురు కావచ్చునని అంటున్నారు. జార్జి ఫెర్నాండెజ్‌ మమతా బెనర్జీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఆహార మంత్రి శాంతా కుమార్‌ను, సామాజిక న్యాయ, సాధికారిక మంత్రి సత్యనారాయణ జతియాలను మంత్రి వర్గం నుంచి తొలగించే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+