AP Rains: బలపడుతున్న అల్పపీడనం-రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వర్షాలు..!

వాయువ్య- పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు (AP Rains), దక్షిణకోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్- ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వర్షాల హెచ్చరిక..!
ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్- ఈ జిల్లాల్లో 48 గంటల పాటు వర్షాల హెచ్చరిక..!

అల్పపీడనం బలపడుతున్న క్రమంలో ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 50-60 కి.మీ వేగంతో, దక్షిణ కోస్తా తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాబటటి ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచిస్తోంది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అలాగే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తోంది.

IMD Rain Alert Heavy Rains Likely in These AP Districts tomorrow
ఉత్తరాంధ్రకు అల్పపీడనం ముప్పు-సర్కార్ అలర్ట్-కంట్రోల్ రూమ్స్..!
ఉత్తరాంధ్రకు అల్పపీడనం ముప్పు-సర్కార్ అలర్ట్-కంట్రోల్ రూమ్స్..!

రేపు శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయన , విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.ఇవాళ రాత్రికి శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+