నల్గొండ యూత్ కాంగ్రెస్ సారధి హత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ధర్మపురి సమీపంలోని నేరేళ్ల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురుపీపుల్స్‌వార్ నక్సలైట్లు మరణించారు. ఈ ఎన్‌కౌంటర్ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం.
జగిత్యాల ధర్మపురి అటవీ ప్రాంతంలో కాంట్రాక్టర్ల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. నక్సలైట్లు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌వివాదాస్పదంగా మారింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌కు క్షమాపణ చెప్పాలనిపీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమయంలోనే కరీంనగర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగడం పరిస్థితిని మరింత తీవ్రం చేసే సూచనలున్నాయి. ప్రభుత్వానికి,పీపుల్స్‌వార్ నక్సలైట్లకు మధ్య జరగనున్న చర్చలపై ఈ ఎన్‌కౌంటర్ల ప్రభావం పడుతుందనడంలో అనుమానం లేదు. ఈ నెల 20వ తేదీనపీపుల్స్‌వార్ నేతలకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య నేరుగా చర్చలు తలపెట్టారు.












Click it and Unblock the Notifications
