విపక్షాల అభ్యర్థి షిండే నామినేషన్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగాసీనియర్ కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన జాతీయ ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థి బైరాన్ సింగ్ షెకావత్‌తో పోటీకి దిగుతున్నారు.
ఇది టోకెన్ ఫైట్ కాదని, ఇది వాస్తవ పోరాటం అని షిండే నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోనియా గాంధీ అన్నారు. జనరల్ కెటగిరీకి చెందిన సోలాపూర్ నియోజకవర్గం నుంచి దళిత నేత షిండే 1999లో రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 1990 దశకం ప్రారంభంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications
