శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాత పలాస- కాశీబుగ్గ మున్సిపల్ కౌనిల్స్ చైర్మన్ పదవి కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ అభ్యర్థి బాబూరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై4,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పలాస- కాశీబుగ్గ మున్సిపల్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది. ఈ ఎన్నికను ఇరుపార్టీల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. వార్డుల్లోనూ కాంగ్రెస్‌ను తన ఆధిక్యతనుప్రదర్శించింది. కాంగ్రెస్ 17 వార్డులు గెల్చుకోగా,తెలుగదేశం పార్టీ 7 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.