సప్తవర్షాలుసర్వత్రా హర్షాలు
హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీసీనియర్ నాయకుడు డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుస్వయంగా ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం పేరు సప్తవర్షాలు-సర్వత్రా హర్షాలు. ఈ ఏడేళ్ళలో చంద్రబాబునాయుడు సాధించినవిజయాలను డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ పుస్తకంలో కూలంకషంగావివరించారు.
తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ పునాదులు వేస్తే ఆ పునాదులపై పార్టీని ఎదురులేని విధంగా పటిష్ఠపరచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఉమ్మారెడ్డి ఆ పుస్తకంలోపేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ ఏడేళ్ళ పాలనలో ప్రారంభించి, జన నీరాజనాలుఅందుకుంటున్న జన్మభూమి తదితర కార్యక్రమాల గురించి ఆయనవివరించారు. ఇ-గవర్నెన్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా చంద్రబాబు నాయుడ్ని ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications
