చిట్టిబాబుకు కన్నీటి వీడ్కోలు
విశాఖపట్నంః నక్సలైట్ల చేతిలో హత్యకుగురైన చింతపల్లి కానిస్టేబుల్ చిట్టిబాబు శవాన్ని పోలీసులు ఎట్టకేలకు కనుగొన్నారు. ఆయన మృతదేహాన్ని చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలోని ఆయనస్వగృహానికి తరలించారు. గత నెల 24న చిట్టిబాబుతో సహా ఐదుగురు పోలీసులను నక్సలైట్లు కిడ్నాప్ చేశారు.మిగిలిన నలుగురిని విడుదల చేసిన నక్సలైట్లు చిట్టిబాబును చంపినట్లు కొద్దిరోజుల తరువాత ప్రకటించారు. ఆయన మృతదేహం గురించి కూడా ఆచూకి తెలియకుండా చేశారు. చివరకు చిట్టిబాబు మృతదేహాన్ని జిమాడుగుల మండలం వలసమామిడి సమీపంలోని అడవిలో పాతిపెట్టినట్లు నక్సలైట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications
