న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ కు చెందినసీనియర్ బిజెపి నాయకుడు వి. రామారావును గవర్నర్ గిరీ వరించింది. రామారావును సిక్కిం గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి కలాం సోమవారం ఆమోదముద్ర వేశారు.
గోవా గవర్నర్ మహ్మద్ ఫజల్ ను మహారాష్ట్ర గవర్నర్ గా నియమించారు. సిక్కిం గవర్నర్ కేదార్ నాథ్ సహానీ ని గోవా గవర్నర్ గా నియమించారు. మహారాష్ట్ర గవర్నర్‌పి.సి. అలెగ్జాండర్ రాజ్యసభకు ఎన్నికైన విషయంవిదితమే.