బూసాన్: ఇక్కడ జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ పోటీల్లో గురువారం భారత్ మూడుస్వర్ణ పతకాలు సాధించింది. స్వర్ణాలు సాధించిన ముగ్గురు కూడా మహిళలే.
మహిళల 1500మీటర్ల పరుగు పందెంలో సునితా రాణి స్వర్ణం సాధించింది. ఆమె నాలుగు నిమిషాల 6.03 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని రికార్డు సృష్టించింది. మహిళల డిస్కస్ త్రోలో భారత్‌కుస్వర్ణం లభించింది. నీలం సింగ్ భారత్‌కు ఈ గౌరవాన్ని దక్కించింది. మహిళల 200మీటర్ల పరుగు పందెంలో కూడా భారత్ బంగారు పతకాన్ని గెల్చుకుంది.