ఉచిత విద్యుత్ పై అంతర్గత గొడవ
హైదరాబాద్: ఉచితవిద్యుత్ సాధ్యమేనంటూ కాంగ్రెస్ చేస్తోన్న హామీపై సొంత గూటిలోనేవిమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లో ఇలాంటి వైరుధ్యాలు సహజమేఅయినప్పటికీ, గురువారం ఈ ఉచిత విద్యుత్ అంశం డ్రమాటిక్ మలుపు తిరిగింది. ఉచితవిద్యుత్ పై యువజన కాంగ్రెస్ గురువారం హైదరాబాద్ లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది.
పిసిసి అధ్యక్షుడు ఎమ్మెసార్ అధ్వర్యంలో సాగిన ఈ సమావేశానికి ప్రముఖవిద్యుత్ నిపుణుడు నార్ల తాతారావు కూడా హాజరయ్యారు. ఉచితవిద్యుత్ సాధ్యమని నిపుణులు కూడా చెప్పుతున్నారంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెసార్ చెప్పారు. పక్కనే కూర్చొన్న తాతారావుతో బలవంతంగా చెప్పించేందుకు ఆయన ప్రయత్నించాడు. అయితే, తాతారావు నర్మగర్భంగా మాట్లాడారు.
మరోవైపు, పార్టీ నుంచి బహిష్కృతుడైన పి.జనార్థన రెడ్డి ఉచితవిద్యుత్ హామీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక, కేరళలలో తొలుత ఉచితవిద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలి. సోనియా గాంధీతో ఆ ప్రకటన చేయించాకే..ఇక్కడ ఉచితవిద్యుత్ హామీ ఇవ్వాలని జనార్ధనరెడ్డి విలేకరులకు తెలిపారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్ ఆర్ తప్ప ఉచితవిద్యుత్ ను బలంగా వాదించే వాళ్ళు కరువయ్యారు.












Click it and Unblock the Notifications
