మార్చిలోగా ఎన్నికలు మంచిది: బాబు

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 14-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది మార్చి లోగా జరగాలనేదే తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గవర్నర్‌ సుర్జీత్‌ సింగ్‌ బర్నాలా శాసనసభను రద్దు చేసిన తర్వాత ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమీషనర్‌ లింగ్డో ప్రకటనపై ప్రతిస్పందిస్తూ ఆయన ఆ మాటలన్నారు.

ఆపద్ధర్మ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం అంత మంచిది కాదని, విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి కాబట్టి మార్చిలో ఎన్నికలు నిర్వహించకూడదని ఆయన అన్నారు. ఈ విషయమై ఎన్నికల కమీషన్‌కు తాము విజ్ఞప్తి చేస్తామని ఆయన చెప్పారు. మార్చిలో పరీక్షలు ఉంటాయని, పోలింగ్‌ బూత్‌ల కోసం ఏ పాఠశాల భవనం కూడా అందుబాటులో ఉండదని, ఈలోగానే ఎన్నికలు జరగడం మంచిదని చంద్రబాబు అన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి