కీలకమైన వన్డేకు అంతా సిద్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 14-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

హైదరాబాద్‌: న్యూజిలాండ్‌, భారత్‌ల మధ్యవన్డే క్రికెట్‌ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని లాల్‌బహుదూర్‌ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి.మ్యాచ్‌ సందర్భంగా అసాధారణ రీతిలో పోలీసు బందోబస్తుఏర్పాటయింది.

ముక్కోణపువన్డే సిరీస్‌లో భాగాంగా చివరి లీగ్‌మ్యాచ్‌ న్యూజిలాండ్‌, భారత్‌ జట్ల మధ్య శనివారం ఇక్కడజరుగుతోంది. ఈ మ్యాచ్‌ రెండు జట్లకు కూడాకీలకమే. ఫైనల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌నుగెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కుచేరుకుంటుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్‌కుచేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచి ఇరు జట్లుప్రాక్టీస్‌ చేశాయి. ఈ మ్యాచ్‌లో గెలుస్తామని భారత జట్టుకెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ ధీమా వ్యక్తంచేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ స్టీఫెన్‌ఫ్లెమింగ్‌ ఆడడం లేదు. బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో పోటీహోరాహోరీ జరగగలదని భావిస్తున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి