మార్కెట్‌ యార్డు చైర్మన్‌ ఇంట్లో హత్య

Posted By:
Subscribe to Oneindia Telugu
Posted on 16-11-03

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

తిరుపతి: తిరుపతిలో మార్కెట్‌ యార్డు చైర్మన్‌ అన్నా రామచంద్రయ్య ఇంట్లో హత్య జరగడం సంచలనం సృష్టించింది. హతుడెవరనేది తెలియదు. ఆదివారం ఉదయం ఈ హత్య జరిగింది.

రామచంద్రయ్య ఇంటికి గట్టి కాపలా ఉంటుంది. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ ఈ హత్య జరగడం విచిత్రంగా ఉంది. ఇంటి ఆవరణలోకి ముగ్గురు దుండగులు ప్రవేశించారని, ఇందులో ఒకరి చేతిలో కత్తి ఉన్నదని, మరొకరి చేతిలో రైఫిల్‌ ఉన్నదని, వారిని తాను అడ్డగించానని వాచ్‌మన్‌ పరుశురాం చెబుతున్నాడు. వారి వద్ద ఉన్న కత్తిని లాక్కుని తాను వారిని ఎదిరించానని అతను చెబుతున్నాడు.

ఆవరణలో ఉన్న టాటా సుమో దగ్ధమైంది. ఈ దాడి జరుగుతున్న సమయంలో ఎవరూ బయటకు రావద్దని పరుశురాం హెచ్చరిస్తూ వచ్చాడని ఇంట్లోనివారు అంటున్నారు. అయితే పరుశురామ్‌ను అనుమానిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌లు, డాగ్‌ స్క్వాడ్స్‌ను రంగంలోకి దించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి