సిఐ బదిలీ, మదన్ కుటుంబానికి పరిహారం
విజయవాడ: తిరుమలలోని వేయి కాళ్ల మండపం పునర్నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఆరవ తేదీన తలపెట్టని శాంతి వాహన యాత్రను వాయిదా వేసుకున్నట్లు చిన జీయర్ స్వామి చెప్పారు. హైకోర్టు సూచన మేరకు వికాస తరంగణి, వేంకటేశ్వర భక్త మండలి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
అక్టోబర్ ఇరవై తేదీన జరిగిన పాదయాత్రలు విజయవంతం అయినట్లు ఆయన చెప్పారు. వేయి కాళ్ల మండపంనై కోర్టులో వాజ్యం నడుస్తోందని, అందువల్ల నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించిందని ఆయన చెప్పారు. న్యాయస్థానంపై గౌరవంతో కార్యక్రమాన్ని మానుకున్నట్లు ఆయన తెలిపారు. న్యాయస్థానంపై తమకు విశ్వాసం ఉన్నదని ఆయన చెప్పారు. తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో నిర్ణయించుకుంటామని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications