మహారాష్ట్ర సియంగా విలాస్‌రావు ప్రమాణం
ముంబాయి: మహారాష్ట్ర ఇరవై మూడవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు విలాసరావు దేశ్‌ముఖ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇది రెండవ సారి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (యన్‌సిపి)కి చెందిన ఆర్. ఆర్. పాటిల్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాన స్వీకారం చేశారు.
వారిద్దరి చేత మహారాష్ట్ర గవర్నర్ మొహమ్మద్ ఫజల్ ప్రమాణం చేయించారు. తమ తమ పార్టీల కార్యకర్తల హర్షధ్వానాల మధ్య విలాసరావు, పాటిల్‌లు మరాఠీలో ప్రమాణం చేశారు. సుశీల్ కుమార్ షిండే స్థానంలో విలాసరావు దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. విలాసరావు, పాటిల్‌లు తమ తమ పార్టీల శాసనసభా పక్ష నాయకులుగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్నికయ్యారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన పదిహేను రోజులకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది.












Click it and Unblock the Notifications