తుస్సుమన్న టిఆర్‌యస్ బ్లాక్‌డే
హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) తలపెట్టిన బ్లాక్ డే కార్యక్రమం తుస్సుమంది. వరంగల్‌లో తప్ప మరెక్కడా దీని ప్రభావం కనిపించలేదు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఒకటవ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలని టి ఆర్‌యస్ నాయకత్వం నిర్ణయించింది.
రాష్ట్రావతరణ దినోత్సవం నాడు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజెప్పడానికి టి ఆర్‌యస్ మంత్రి సంతోష్ రెడ్డి నిజామాబాద్‌లో వ్యతిరేక వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చేరిన నాడే ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. ప్రభుత్వంలో చేరిన తర్వాత రాజ్యాంగ బద్దంగా వ్యవహరిస్తామని ప్రమాణం చేసిన తర్వాత నిరసన వ్యక్తం చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఆయన నిజామాబాద్‌లో రాష్ట్రావతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్‌లో టి ఆర్‌యస్ కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించారు. నిరసనగా గుండ్లు కొట్టించుకున్నారు. ఇంతకు మించి మరెక్కడా నల్లబ్యాడ్జీల కార్యక్రమం ప్రభావం కనిపించిన దాఖలాలు లేవు.











Click it and Unblock the Notifications