కానిస్టేబుల్ మృతిపై వరంగల్‌లో ఉద్రిక్తత
వడ్తల్ (మధ్య గుజరాత్): ప్రజా నాయకుడిగా ఎల్.కె. అద్వానీ అనర్హుడని విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హిందూ సమాజం విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు.
బిజెపి అధ్యక్షుడిగా అద్వానీ ఎంత కాలం కొనసాగుతారనేది తనకు తెలియదని, అద్వానీ స్టాప్ గ్యాప్ ప్రెసిడెంట్ మాత్రమేనని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. విహెచ్‌పి పూర్తి కాలం కార్యకర్తల కోసం జరిగిన తొమ్మిది రోజుల శిక్షణా శిబిరం వివరాలను సోమవారం ఆయన విలేకరులకు అందజేస్తూ ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.హిందూ సమాజం దృష్టిలో అద్వానీ పరాజితుడని ఆయన అన్నారు. బిజెపి నుంచి విహెచ్‌పి ఆశిస్తున్నదేమిటని అడిగితే తాను ఏమీ ఆశించడం లేదని, అది హిందూ సమాజం నమ్మకాన్ని కోల్పోయిందని ఆయన సమాధానమిచ్చారు. హిందూత్వ అంశాలను మరింత చొరవతో ముందుకు తీసుకు వెళ్లడానికి బిజెపి బదులు మరో రాజకీయ అంగం అవసరమని ఆయన చెప్పారు. దాని గురించి వివరించాలని కోరగా " ఓపిక పట్టండి. క్రమంగా మీకే తెలుస్తుంది అని ఆయన జవాబిచ్చారు.పార్టీలో నాయకత్వ లోపం, నియంత్రణ లోపం, పార్టీ హిందూ ఇమేజ్‌ను కోల్పోవడం, ప్రశ్నార్థకమైన వ్యక్తులు పార్టీలోకి ప్రవేశించడం ఎన్నికల్లో బిజెపి ఓటమికి కారణాలని ఆయన అన్నారు. దీని వల్లనే పార్టీ అభ్యర్థులు చాలా మంది డిపాజిట్లు కూడా కోల్పోయారని ఆయన అన్నారు.ఇదిలా వుంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్‌యస్‌యస్) ఛీఫ్ సుదర్శన్‌తో బిజెపి సీనియర్ నేతలు వాజ్‌పేయి, అద్వానీ న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.











Click it and Unblock the Notifications