బర్నాలాకు ఘనంగావీడ్కోలు
హైదరాబాద్:తమిళనాడు గవర్నరుగా బదిలీ అయినసుర్జీత్ సింగ్ బర్నాలాకు బుధవారంఉదయం రాజ్‌భవన్‌లోను, విమానాశ్రయంలోను ఘనంగావీడ్కోలుపలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనేకాక ప్రజలతో తనకు సాన్నిహిత్యంఏర్పడిందని, ఈ రాష్ట్రాన్ని విడిచివెళ్ళడం బాధగా ఉందని బర్నాలా అన్నారు.
ముఖ్యమంత్రి,స్పీకరు, మంత్రులు ఉదయమే రాజ్‌భవన్‌కుచేరుకుని ఆయనతో ఫోటోలు దిగారు.బర్నాలా వెంట విమానాశ్రయం వరకువీరంతా వెళ్ళారు. విమానాశ్రయంలోగవర్నరుకు త్రివిధ దళాలు వందనంచేశాయి. తమిళనాడు ప్రభుత్వం పంపినప్రత్యేక విమానంలో బర్నాలా చెన్నైకివెళ్ళారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతకాలం తెలుగు నేర్చుకున్న బర్నాలా తమిళనాడువెళ్ళాక తమిళం నేర్చుకోవాలనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
