వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాణసంచాపేలి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం:శ్రీకాకుళం జిల్లాలో బాణసంచా పేలిపదకొండు మంది మరణించారు.శ్రీకాకుళం పట్టణంలోని చౌకబజారులో గల పి.సత్యారావు ఇంట్లో గురువారం రాత్రిజరిగిన భారీ విస్ఫోటనం సంబంధించింది. ఈవిస్ఫోటనంలో రెండు భవంతులుకుప్పకూలాయి. శుక్రవారం మరోవిస్ఫోటనం సంభవించింది.

బాణాసంచానురెండు లారీలలో తరలిస్తుండగా ఒక లారీపేలిపోయింది. ఈ సంఘటనలో నలుగురుగాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరిపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.శుక్రవారం జరిగిన పేలుడులో కూలిపోయినభవనాలశిథిలాలను తొలగిస్తున్న కొలదీమృతదేహాలు బయటపడుతున్నాయి.పేలుడు సంభవించిన సమయంలో అక్కడపదిహేను మంది కొనుగోలుదారులు ఉన్నట్లుభావిస్తున్నారు.

శుక్రవారంరెండు గోడౌన్లలోని బాణసంచాను రెండులారీల్లో తరలిస్తుండగా ఒక లారీపేలిపోయింది. ఈ సంఘటనలోనిగాయపడినవారు కింగ్‌జార్జి ఆస్పత్రిలోచికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనకుసంబంధించి ఎమ్మార్వోను, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్‌చేసింది. పేలుడు సంఘటనలోమరణించివనారి కుటుంబాలకుప్రభుత్వం లక్ష రూపాయలేసిఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. సంఘటనాస్థలాన్ని హోం మంత్రి కె. జానారెడ్డి, మాజీమంత్రి తమ్మినేని సీతారాంతదితరులుసందర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X