టిఆర్‌యస్‌తప్పులు చేయకుండా చూస్తా: కెకె
హైదరాబాద్:తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)తప్పులు చేయకుండా చూడటమే తనబాధ్యత అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు అన్నారు. తెలంగాణపైతమ వైఖరిలో ఏ విధమైన మార్పులేదని ఆయన శుక్రవారం విలేకరులసమావేశంలో చెప్పారు.
అవసరమైతేటిఆర్‌యస్‌ను తమ దారిలోకితేవడానికి ప్రయత్నం చేస్తాననిఆయన చెప్పారు. సమస్యలపై తామురాజీ లేని పోరాటం చేస్తామని ఆయనచెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలనుప్రజల్లోకి తీసుకెళ్లి వాటి ద్వారా లబ్ధిపొందేలా చూస్తామని ఆయన అన్నారు.తాము ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలనుఅమలు చేయడానికి ప్రభుత్వం చర్యలుతీసుకుంటోందని ఆయన చెప్పారు.మున్సిపల్ ఎన్నికల్లో టి ఆర్‌యస్‌తోపొత్తుపై పరిశీలించి నిర్ణయంతీసుకుంటామని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రాంతీయ సమన్వయకమిటీకి ఇకపై కూడా ప్రాధాన్యంఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
