ప్రభుత్వంసమాచారం ఇవ్వకపోవడమే....: టిడిపి
హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపంవల్లనే షెడ్యూల్ కులాల ( ఎస్‌సి)రిజర్వేషన్ల వర్గీకరణను సుప్రీంకోర్టుకొట్టేసిందని తెలుగుదేశం పార్టీనాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరివిమర్శించారు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌రాష్ట్ర ప్రభుత్వం తగిన సమాచారంఅందించకపోవడం వల్ల ఈ పరిస్థితివచ్చిందని ఆయన శుక్రవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణకు కడియంశ్రీహరి మొదటి నుంచి అనుకూలంగావున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటసమితి ఉద్యమానికి ఆయన అండదండలుఉన్నాయి.
ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణను అమలుచేయడానికి పార్లమెంటులో చట్టం తేవాలనిఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలోపెట్టుకొని ఎస్‌సి రిజర్వేషన్లను తమప్రభుత్వం వర్గీకరించిందని ఆయనచెప్పారు. దీన్ని రక్షించాలనేచిత్తశుద్ధిగానీ, బలహీనులకు న్యాయంచేయాలనే చిత్తశుద్ధి గానీ కాంగ్రెస్‌ప్రభుత్వానికి లేకపోవడం వల్లనేసుప్రీంకోర్టు నుంచి ఈ తీర్పు రావడానికిగల కారణమని ఆయన అన్నారు.
ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణ రాజకీయడిమాండ్ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు అన్నారు.న్యాయపరమైన అంశం కారణంగాసుప్రీంకోర్టు ఎస్‌సి రిజర్వేషన్లవర్గీకరణను కొట్టేసిందని ఆయనశుక్రవారం విలేకరులతోఅన్నారు.












Click it and Unblock the Notifications
