ఎక్కువఫ్లయిట్లు నడిపితే రాయితీలు: వైయస్
హైదరాబాద్:రాష్ట్రం నుంచి అత్యధిక సర్వీసులునడిపే ప్రైవేట్ విమాన సర్వీసులసంస్థలకు రాయితీలు ఇవ్వనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఎయిర్ సహారానిర్వహించిన ఒక కార్యక్రమంలోఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఎయిర్‌సహారా తన కార్యాలయాన్నిహైదరాబాద్‌లో ఏర్పాటు చేసినందుకుఆయన అభినందించారు.
రంగారెడ్డిజిల్లా షంషాబాద్‌లో తలపెట్టినఅంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోపూర్తవుతుందని ఆయన చెప్పారు. ఈవిమానాశ్రయం వచ్చిన తర్వాతహైదరాబాద్ నుంచి ఐదు వందలవిమానాలు నడవాలనేది తమఅభిప్రాయమని ఆయన చెప్పారు.ఇంధనంపై అమ్మకం పన్ను తగ్గించాలనికొన్ని సంస్థలు కోరుతున్నాయని, ఈవిషయంపై ప్రభుత్వం ఒక విధానాన్నిరూపొందిస్తోందని ఆయన అన్నారు.హైదరాబాద్‌నుంచి నూటా ఇరవై ఆరు సర్వీసులునడపనున్నట్లు ఎయిర్ సహారా ప్రతినిధితెలిపారు.











Click it and Unblock the Notifications
