టిడిపిఅప్పులు సోకులకే ఖర్చు: వైయస్
హైదరాబాద్/రాజమండ్రి: తాము తెచ్చిన అప్పులు పేదలప్రయోజనాలకు ఖర్చు చేశామని,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోతెచ్చిన అప్పులను సోకులకు ఖర్చు చేశారనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం రాజీవ్ పల్లెబాటలోపాల్గొనేందుకు బయలుదేరే ముందుఆయన హైదరాబాద్‌లో ఆయనవిలేకరులతో మాట్లాడారు.
తాముచేపట్టిన నీటి పారుద ప్రాజెక్టులనుచూసి తెలుగుదేశం పార్టీభయపడుతోందని, దీని వల్ల తమకునూకలు చెల్లిపోతాయనేదితెలుగుదేశం భయమని ఆయనరాజీవ్ పల్లెబాటలో అన్నారు.తెలుగుదేశం వారిని చూసి జాలిపడుతున్నామని, వారి బాధలను చూసివెనక్కి తగ్గబోమని ఆయన అన్నారు.పోలవరం ప్రాజెక్టును నిర్ణీతకాలవ్యవధిలో పూర్తి చేస్తామని ఆయనచెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ అని నామకరణంచేయనున్నట్లు ఆయన తెలిపారు.పోలవరం ఎడమ కాలువకు త్వరలోభూమి పూజ చేస్తామని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
