రైతులకు కేంద్రమంత్రి తీపికబురు.. ప్రతిపాదిత విత్తనచట్టంతో మీకే లబ్ది!

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టంపైన రైతులలో ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ కేంద్ర రైతు సంక్షేమ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు తీపికబురు చెప్పారు. రైతులకు నకిలీ విత్తనాలను అరికట్టటం కోసం,నాణ్యతను పెంచటం కోసం 1996నాటి విత్తన చట్టంలో ఉన్న లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొత్త విత్తన చట్టాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పారు.

అయితే కొత్త విత్తన చట్టంతో కార్పోరేట్ కంపెనీలకు లబ్ది జరుగుతుందని, రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గత కొంతకాలంగా ఆందోళన ఉంది. ఈ ఆందోళనకు చెక్ పెడుతూ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు శుభవార్త చెప్పారు. ప్రతిపాదిత కొత్త విత్తన చట్టం కింద రైతుల హక్కులను పూర్తిగా పరిరక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణాకు కేంద్రం తీపికబురు.. ఘట్‌కేసర్ కాజీపేట మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
తెలంగాణాకు కేంద్రం తీపికబురు.. ఘట్‌కేసర్ కాజీపేట మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
Good news to farmers New Seed Act to Fully Protect Farmers Rights Agriculture Minister Shivraj Singh Chouhan

సంప్రదాయ విత్తనాలు, రైతులు స్వయంగా అభివృద్ధి చేసుకున్న రకాలను ఉపయోగించుకోవడం, పరస్పరం మార్చుకోవడం, విక్రయించుకోవడంపై ఈ కొత్త చట్టంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. న్యూఢిల్లీలో రైతు సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహించారు. 1966 నాటి విత్తన చట్టం ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోలేకపోతోందని ఆయన వివరించారు.

నకిలీ, నాసిరకం విత్తనాల సమస్య, నాణ్యతపై బాధ్యత లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వాడుతున్న విత్తనాల్లో సుమారు 70 శాతం చట్ట పరిధికి బయట ఉన్నాయని తెలిపారు.కొత్త చట్టంలో రైతులు తమ సంప్రదాయ విత్తనాలను రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తరతరాలుగా సంరక్షిస్తున్న స్థానిక రకాలకు రక్షణ లభిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. అన్ని రకాల విత్తనాలను జాతీయ రిజిస్టర్‌లో నమోదు చేసే విధానం తీసుకు వస్తున్నామన్నారు.

ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ కొత్త రైల్వే లైన్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాలవారికి పండుగే!
ఏపీకి కేంద్రం శుభవార్త.. ఈ కొత్త రైల్వే లైన్లతో చిత్తూరు, తిరుపతి జిల్లాలవారికి పండుగే!

రాష్ట్రాలకు కొత్త రకాలను విడుదల చేసే అధికారాలు పెంచుతామని చెప్పారు .ప్రతి రాష్ట్రంలో సీడ్ సెక్యూరిటీ ఫండ్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. రైతులకు విత్తనాల వైఫల్యం వల్ల నష్టం జరిగితే ప్రత్యేక కమిటీ పరిశీలించి 15 రోజుల్లో పరిహారం అందిస్తారని ఆయన అన్నారు. వినియోగదారుల చట్టం కింద కూడా పరిహారం కోరే హక్కు కొనసాగుతుందని వెల్లడించారు. నకిలీ విత్తనాల నుంచి రైతులను కాపాడుతూ, సంప్రదాయ హక్కులను పరిరక్షించడమే కొత్త చట్టం ప్రధాన లక్ష్యమని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+