తెలంగాణకేఎక్కువ నిధులు: గాలి
హైదరాబాద్:తమ ప్రభుత్వం తెలంగాణప్రాంతంలోనే ఎక్కువ నిధులు ఖర్చుచేస్తోందని కాంగ్రెస్ శాసనసభ్యుడుగాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు.యాభై శాతం నిధులను తెలంగాణకుకేటాయించినట్లు ఆయన మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.తెలంగాణకు కాంగ్రెస్ తీవ్ర ద్రోహంచేస్తోందని తెలుగుదేశం నాయకుడుకడియం శ్రీహరి చేసిన విమర్శకుఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
తెలుగుదేశంతన తొమ్మిదేళ్ల పాలనలో పాటించిననిర్లక్ష్యం వల్లనే తెలంగాణ రాష్ట్రడిమాండ్ ముందుకు వచ్చిందని, దానినుంచే తెలంగాణ రాష్ట్ర సమితిపుట్టిందని ఆయన అన్నారు. తెలంగాణరాష్ట్ర సమితిని ఏర్పాటు చేసింది కూడాతెలుగుదేశం వారేనని, కాంగ్రెస్‌వారు కాదని ఆయన అన్నారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపైతమ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి దృష్టికేంద్రీకరిస్తున్నారని ఆయన చెప్పారు.తెలుగుదేశంనాయకులు రాయలసీమలో ఒక రకంగా,కోస్తాలో మరో రకంగా, తెలంగాణలోఇంకొక రకంగా మాట్లాడుతున్నారని,ప్రాంతీయ విభేదాలనురెచ్చగొడుతున్నారని ఆయనవిమర్శించారు. వెటర్నరీ యూనివర్శిటీనితిరుపతిలో నెలకొల్పాలని తీసుకున్నప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాంతీయవిద్వేషంతో కృష్ణా జిల్లా తెలుగుదేశంనాయకులు వ్యతిరేకిస్తున్నారని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
