గందరగోళంమధ్య ముగిసిన జనశక్తి సభ
ఖమ్మం:సిపిఐ (యంయల్) జనశక్తి సభానిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చినట్లేఇచ్చారు. కానీ పూర్తిగా జరగనివ్వలేదు.సభ ప్రారంభమైన పదిహేనునిమిషాలకే ముగించాల్సిందిగా ఆదేశించారు.గందరగోళం మధ్య సభముగిసింది.
కరీంనగర్‌లోఇటీవల జనశక్తి తలపెట్టినబహిరంగ సభకు పోలీసులు అనుమతినిరాకరించారు. దీంతో సభ రద్దయింది. ఆతర్వాత ఖమ్మంలో జనశక్తిమంగళవారం బహిరంగ సభనిర్వహించాలని తలపెట్టింది. అయితేమొదట అనుమతికి మల్లగుల్లాలుపడిన పోలీసులు ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు.అయితే సభ ప్రారంభమైన పదిహేనునిమిషాలకే ముగించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.











Click it and Unblock the Notifications
