తెలంగాణకుగడువు సరి కాదు: కెకె
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌యస్) గడువువిధించడం సరి కాదని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ (పిసిసి) నూతనఅధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుఅన్నారు. డిసెంబర్‌లోనో, జనవరిలోనోతెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందనిఅనడం సరి కాదని, టి ఆర్‌యస్‌నాయకులు వాస్తవిక దృక్పథంతోఆలోచించాలని ఆయన మంగళవారం మీట్ దిప్రెస్ కార్యక్రమంలో అన్నారు.
ప్రజలుకోరుకుంటేనే తెలంగాణ రాష్ట్రంఏర్పడుతందని, తెలంగాణ రాష్ట్రంఏర్పాటుకు రెఫరెండం అవసరంలేదని ఆయన అన్నారు. తెలంగాణరాష్ట్ర ఏర్పాటును స్థల, కాలాలునిర్ణయిస్తాయని ఆయన అన్నారు.తెలంగాణ చట్టబద్దంగానే వస్తుందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంటేఆంధ్రులకు వ్యతిరేకం కాదని ఆయనఅన్నారు. టి ఆర్‌యస్ నాయకులు కె.చంద్రశేఖర్‌రావు, నరేంద్రలతోతాను మాట్లాడానని, కొంత వాస్తవికదృక్పథంతో ఆలోచించాలని తాను వారికిచెప్పానని కేశవరావు రావువివరించారు.ప్రభుత్వంప్రజా ప్రభుత్వం అనిపించుకోవాలంటే పార్టీఅవసరమని, ఎన్నికల ప్రణాళికలో ప్రజలకుఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుపరచడానికి పార్టీ ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తుందని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
