నక్సల్స్‌తోరెండో దఫా ఉంటుంది: యంయస్
కరీంనగర్:నక్సలైట్లతో రెండో దఫా చర్చలు జరిగితీరుతాయని దేవాదాయ శాఖ మంత్రి యం.సత్యనారాయణరావు అన్నారు.నక్సలైట్లు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకోవడం సరి కాదని ఆయనమంగళవారం విలేకరులసమావేశంలో అన్నారు.
నక్సలైట్లకుప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉన్నదని,ఇతర రాజకీయ పార్టీలువిమర్శిస్తున్నట్లుగానే నక్సలైట్లు కూడాప్రభుత్వాన్ని విమర్శించవచ్చునని,అయితే చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకోవడం మంచిది కాదని ఆయనఅన్నారు. నక్సలైట్లు మిగులు భూములనుగుర్తించవచ్చునని, అయితే పంపిణీచేసే పనికి పూనుకోవద్దని ఆయనఅన్నారు. మిగులు భూములు పంచేందుకు,ప్రజా సమస్యలను పరిష్కరించేందుకుప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఆయనఅన్నారు. నక్సలైట్లు జన జీవనప్రవంతిలోకి రావాలనేదే తమ కోరిక అనిఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
