ఎస్‌సిరిజర్వేషన్ల వర్గీకరణకు కొత్తడిమాండ్లు
హైదరాబాద్:షెడ్యూల్ కులాల రిజర్వేషన్లవర్గీకరణకు కొత్త డిమాండ్‌తోమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(యంఆర్‌పియస్) కొత్త డిమాండ్లతోముందుకు వచ్చింది. తమ డిమాండ్లపరిష్కారానికి వచ్చే నెల పదవ తేదీవరకు గడువు ఇస్తున్నట్లుయంఆర్‌పియస్ నాయకుడు మందకృష్ణ మాదిగ బుధవారం విలేకరులసమావేశంలో చెప్పారు.
ఎస్‌సిరిజర్వేసన్ల వర్గీకరణపై చర్చకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని,వర్గీకరణకు ఆమోదం తెలుపుతూమంత్రివర్గం తీర్మానం చేయాలని,అనంతరం వర్గీకరణపై అసెంబ్లీలోతీర్మానం చేసి కేంద్రానికి పంపాలనిఆయన డిమాండ్ చేశారు. ఈ మూడుడిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంవెంటనే స్పందిస్తుందని ఆశిస్తున్నట్లుఆయన తెలిపారు. వచ్చే నెల పదవతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికిగడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ రాజ్యాంగవిరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఎస్‌సిరిజర్వేషన్లను వర్గీకరిస్తూ గతతెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసినఉత్తర్వులను కొట్టివేసింది.











Click it and Unblock the Notifications
