వీడియోపైరసీకి ఆర్డినెన్స్ అడ్డుకట్ట: వైయస్
హైదరాబాద్:వీడియో పైరసీని అరికట్టడానికి త్వరలో ఒకఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిచెప్పారు. చలన చిత్ర రంగ పరిశ్రమసమస్యలపై ప్రధాన కార్యదర్శినేతృత్వంలో ఒక కమిటీ వేశామని, ఆకమిటీ సూచనల మేరకు చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు. చలనచిత్రాలు సామాజిక బాధ్యతనునిర్వర్తించాలని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డిఉద్బోధించారు. వ్యాపార పరంగా లాభాలుసాధిస్తూనే సామాజిక బాధ్యతనునెరవేర్చడం అవసరమని ఆయనఅన్నారు.
విజేతలకు ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి నందిఅవార్డులను అందజేశారు. వి.బి. రాజేంద్రప్రసాద్‌కు ముఖ్యమంత్రి రఘుపతివెంకయ్య అవార్డును ప్రదానం చేసిసత్కరించారు. హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో వైభవంగా జరిగినఉత్సవంలో ఆయన బుధవారం ఈఅవార్డులను ప్రదానం చేశారు.
తమనుడబ్బు అడకుండా ఏ మేలు చేయాలని అడిగినాచేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సినిమాలుసామాజిక స్పృహకు కారణం కావాలని,సామాజిక పరిస్థితులను మెరుగుపరేచాలా ఉండాలని ఆయన సూచించారు. కొంతమంది పేదలకు మేలు చేసే విధంగాకాకుండా సామాన్య కళాకారులకు మేలుజరిగే విధంగా వ్యవహరించడంమంచిదని, ఈ దిశలో ప్రభుత్వ నిర్ణయాలుఉంటాయని ఆయన చెప్పారు.తనకుచలన చిత్రరంగం గురించి ఏమీతెలియదని, చిత్రాలు ఎలా ఉండానే విషయాన్నిగుమ్మడి చెప్పారని, చిత్ర పరిశ్రమ ఎలావ్యవహిరిస్తోందనే విషయాన్ని దాసరినారాయణరావు చెప్పారని ఆయనఅన్నారు. సినిమా పరిశ్రమ ఏ దిశలోపయనిస్తుందనే విషయంప్రత్యక్షంగా తనకు తెలియదని,గత ఇరవై, పాతికేళ్లుగా తానుసినిమాలు చూడలేదని ఆయన అన్నారు.పరిశ్రమసమస్యలను అందరూ కూర్చొనికూలంకషంగా చర్చించుకోవాలని, చిన్నసినిమాలను బతికించుకోవాలని, పెద్దహీరోలందరూ చిన్న సినిమాల నుంచివచ్చినవారేనని కేంద్ర మంత్రి, ప్రముఖసినీ దర్శకుడు దాసరి నారాయణరావుఅన్నారు. ఫ్లాట్ రేట్లతో ప్రజల సొమ్మునుదోచేస్తామనే ఆలోచనకు కూడా స్వస్తిచెప్పాలని ఆయన అన్నారు. అంతర్జాతీయ,జాతీయ స్థాయిలకు వెళ్లే స్థితి లేదని,అందుకు మనం సిగ్గుపడాలని,మలయాళం, కన్నడం సినిమాలువెళ్తున్నాయని ఆయన అన్నారు. ఆర్ట్‌సినిమాల నిర్మాణం కోసం, జాతీయ,అంతర్జాతీయ అవార్డుల కోసం ఆర్థికసహాయం అందించే ఏర్పాటు చేయాలని ఆయనసూచించారు. ఎంతో మందిప్రతిభావంతులైన కుర్రాళ్లుఉన్నారని, వారిని ప్రోత్సహించాలని ఆయనఅన్నారు. నంది అవార్డుల సందర్భంగావెలువరించిన సావనీర్‌ను ఆయనవిడుదల చేశారు.నందిఅవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలోతెలుగుదేశం ప్రభుత్వం హయాంలోతనకు అవకాశం రాలేదని, తెలుగుసినీ పరిశ్రమ హైదరాబాద్‌కుతరలిరావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలుకారణమని, అయితే చాలా సినీ కళాకారులుఎన్నికల్లో కాంగ్రెస్‌కు సహకరించడానికినిరాకరించారని, కానీ కాంగ్రెస్‌ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకుపాల్పడదని దాసరి నారాయణరావుఅన్నారు.అంతకుముందు సినీ నటి ప్రభనేతృత్వంలో కూచిపూడినృత్యప్రదర్శన జరిగింది. ఈకార్యక్రమానికి కేంద్ర మంత్రి, ప్రముఖసినీ దర్శకుడు దాసరి నారాయణరావు,ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్,అవార్డుల జ్యూరీ చైర్మన్ గుమ్మడి,తదితర సినీ ప్రముఖలు హాజరయ్యారు.దాసరి నారాయణ రావు అవార్డులప్రదానోత్సవ సభకు అధ్యక్షతవహించారు. నిర్మాత ఆదిశేషగిరిరావు ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతడి.వి.యస్. రాజు, టి. యల్.కాంతారావు, ఈ ఏడాది రఘుపతి వెంకయ్యఅవార్డు పొందిన వి.బి. రాజేంద్ర ప్రసాద్,గుమ్మడి, సమాచార పౌర సంబంధాలకమీషనర్ కె.వి. రమణ వేదికనుఅలంకరించారు.ఒక్కడు,మిస్సమ్మలకు నంది అవార్డుల పంట











Click it and Unblock the Notifications
