నక్సల్స్‌తోఎపి ప్రభుత్వ చర్చలు సరైనవే:పియం
న్యూఢిల్లీ:నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం చర్చలు జరపడంసరైందేనని ప్రధాని డాక్టర్‌మన్మోహన్ సింగ్ అన్నారు. హేగ్‌లో జరిగినఇండో - యూరోపియన్ యూనియన్‌సమావేశంలో పాల్గొని వస్తూ విమానంలోఆయన విలేకరులతో మాట్లాడారు.నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం జరుపుతున్న చర్చలపైభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ చేసిన విమర్శలనుఆయన ఖండించారు.
జనజీవనస్రవంతిలో కలవాలనుకునే తీవ్రవాదసంస్థలన్నింటితో చర్చలు జరుపుతామనిఆయన చెప్పారు. నక్సల్స్ ప్రభావితరాష్ట్రాలను సంప్రదించిన తర్వాతనేచర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లుఆయన తెలిపారు. నక్సలైట్లు కూడామన పౌరులేనని, వారికి అవకాశంఇవ్వడం అవసరమని ఆయన అన్నారు.తెలంగాణపై ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడిఉంటామని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
