నక్సల్స్‌సభకు అనుమతి కష్టమే: ఆర్‌పి సిన్హా
హైదరాబాద్:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్లు ఈ నెలపదహారవ తేదీన హైదరాబాద్‌లోతలపెట్టిన బహిరంగ సభకుప్రస్తుత పరిస్థితిలో అనుమతి ఇవ్వడంసాధ్యం కాకపోవచ్చుననిహైదరాబాద్ పోలీసు కమీషనర్ ఆర్.పి.సిన్హా అన్నారు. మావోయిస్టు కమ్యూనిస్టుసెంటర్, పీపుల్స్‌వార్‌ల విలీనంతో సిపి ఐ(మావోయిస్టు) ఏర్పడిన సందర్భాన్నిపురస్కరించుకొని నక్సలైట్లు ఈ నెలపదహారవ తేదీన బహిరంగ సభతలపెట్టారు
బహిరంగసభకు అనుమతి కోసం తమవద్దకు ఇప్పటి వరకు ఎవరూరాలేదని ఆయన బుధవారంవిలేకరులతో చెప్పారు. కమీషనర్‌ప్రకటనతో సిపిఐ (మావోయిస్టు)నక్సలైట్ల సభపై నీలి నీడలుఅలుముకున్నాయి. సభల వల్లహైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యతలెత్తుతోందని, శాంతిభద్రతలపరిరక్షణ కూడా కష్టమవుతోందనికమీషనర్ అన్నారు. ఇప్పటికేనక్సలైట్లు ఒక సభ నిర్వహించారని,చర్చల కోసం హైదరాబాద్‌లోనక్సలైట్ నేతలు ఉన్నారని ఆయనఅన్నారు.











Click it and Unblock the Notifications
