కాంట్రాక్టర్లరింగ్‌లో మా పాత్ర లేదు: పొన్నాల
హైదరాబాద్:నీటి పారుదల ప్రాజెక్టుల టెండర్లలోకాంట్రాక్టర్లు రింగ్ కావడంలోప్రభుత్వ పాత్ర లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యస్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియఆగబోదని ఆయన స్పష్టం చేశారు.
ఒకకాంట్రాక్టర్ హైకోర్టుకు వెళ్లాడని,విచారణ పదకొండవ తేదీనజరుగుతుందని తెలిసిందని ఆయనచెప్పారు. కాంట్రాక్టర్లు రింగ్‌కావడంలో ప్రభుత్వ పాత్ర లేదని,కాంట్రాక్టర్లలో ఒకరికొకరికి పడకప్రభుత్వంపై బురద చల్లేప్రయత్నం చేస్తున్నారని ఆయనఅన్నారు.నీటిపారుదల ప్రాజెక్టుల టెండర్లలోఅక్రమాలు లేవని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి స్పష్టంచేశారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లోఅవినీతికి తావు లేకుండా చూస్తామనిఆయన చెప్పారు. టెండర్ల ప్రక్రియసక్రమంగా జరుగుతోందనడానికికాంట్రాకర్ల పోటీయే నిదర్శనమనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
