బిజెపి నుంచిఉమాభారతి సస్పెన్షన్‌

న్యూఢిల్లీ:ఫైర్‌బ్రాండ్‌ ఉమాభారతిని పార్టీసభ్యత్వం, పార్టీ ప్రధాన కార్యదర్శిపదవి నుంచి భారతీయ జనతా పార్టీ(బిజెపి) నుంచి తొలగించారు. ఆమెనుఆరేళ్ల పాటు పార్టీ సభ్యత్వం నుంచితొలగించారు. ఉమా భారతిపార్టీ ఆఫీస్‌ బియరర్ల సమావేశంనుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత ఈవిషయాన్ని జస్వంత్‌ సింగ్‌ విలేకరులసమావేశంలో ప్రకటించారు. పార్టీనాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ, పార్టీనాయకులను విమర్శిస్తూ ఆమె పార్టీసమావేశం నుంచి వాకౌట్‌చేశారు.

ఉమాభారతి వెళ్లిపోయిన తర్వాతసమావేశం సజావుగా సాగిందనిజస్వంత్‌ సింగ్‌ చెప్పారు. ఉమా భారతి,అబ్బాస్‌ నక్వీ, షెహనవాజ్‌ పార్టీక్రమశిక్షణను ఉల్లంఘించారని అద్వానీఆఫీస్‌ బేరర్ల సమావేశంలోఅనడంతో ఉమాభారతి తీవ్ర ఆగ్రహానికిగురయ్యారు. అద్వానీపై విమర్శలుచేశారు. అద్వానీ తన అధ్యక్షోపన్యాసంముగించిన వెంటనే తన పేరుప్రస్తావించినందుకు తనకుమాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని ఉమాభారతి కోరారు. అందుకు అద్వానీనిరాకరించారు. సమావేశంలో ఉన్ననలుగురైదుగురు నాయకులు ఆఫ్‌ దిరికార్డు పేర మీడియాకు విషయాలుచెబుతున్నారని, వారిపై చర్య తీసుకోవాలనిఉమా భారతి డిమాండ్‌ చేశారు. ఉమాభారతి బహిరంగ తిరుగుబాటుకుపక్కనే కూర్చున్నవెంకయ్యనాయుడు, రాజ్‌నాథ్‌ సింగ్‌షాక్‌ తిన్నారు.సమావేశంనుంచి బయటకు వచ్చిన ఉమా భారతిస్వదేశీ జాగరణ్‌ మంచ్‌ నాయకుడుగురుమూర్తిని కలవడానికి వెళ్లారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+