రెండో ఎస్సార్సీద్వారానే తెలంగాణ: కెకె
హైదరాబాద్:రెండో రాష్ట్రాల పునర్విభజన కమీషన్(రెండో ఎస్సార్సీ) ద్వారానే తెలంగాణరాష్ట్రం సాధ్యమని ప్రదేశ్ కాంగ్రెస్‌కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావు అన్నారు. తెలంగాణరాష్ట్ర సమితి (టిఆర్‌యస్)కి చెందినకొంత మంది నాయకులు గురువారంకాంగ్రెస్‌లో చేరారు.
టిఆర్‌యస్‌నాయకులు కాంగ్రెస్‌లో చేరడం వల్లఇరు పార్టీల మధ్య సంబంధాలు ఏమీ దెబ్బతినవని కేశవరావు విలేకరులతోఅన్నారు. తెలంగాణ రాజ్యాంగబద్దంగా,ప్రజాస్వామిక పద్ధతిలో, శాంతియుతపద్దతిలో మాత్రమే సాధ్యమని ఆయనఅన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వల్లనేసాధ్యమవుతుందనేఉద్దేశంతోనే తాము ఈ పార్టీలోచేరుతున్నట్లు కాంగ్రెస్‌లో చేరిననాయకులు అన్నారు.











Click it and Unblock the Notifications
