మావోయిస్టులసభా వేదిక మార్పు
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఈ నెల పదహారవతేదీన తలపెట్టిన సిపిఐ (మావోయిస్టు)బహిరంగ సభా వేదిక రంగారెడ్డి జిల్లాఘట్కేసర్ మండలం చెంగిచెర్లకుమారింది. హైదరాబాద్‌లో సభానిర్వహనకు పోలీసులు అనుమతినిరాకరించడంతో వేదికనుచెంగిచర్లకు మార్చుకున్నారు.శాంతిభద్రతలకు విఘాతంకలుగుతుందంటూ తమ సభలనుఆపుతున్నారని సిపి ఐ (మావోయిస్టు) ప్రతినిధివరవరరావు, సిపిఐ (యంయల్)జనశక్తి ప్రతినిధి చంద్రన్నగురువారం విలేకరుల సమావేశంలోవిమర్శించారు.
పోలీసుచర్యలకు నిరసనగా ఈ నెల పద్నాలగవతేదీ నుంచి కరీంనగర్, ఆసిఫాబాద్,తదితర అమరవీరుల సంస్మరణసభలను రద్దు చేసుకుంటున్నట్లువారు తెలిపారు. విధాన నిర్ణయంగానేతమ సభలను ఆపుతున్నారని వారువిమర్శించారు. హైకోర్టు ఉత్తర్వులున్నాపులిచింతలపై సదస్సును పోలీసులుజరగనివ్వలేదని, పులిచింతల శిలాఫలకాన్నిపోలీసులే ధ్వంసం చేసి మావోయిస్టులపైకేసులు పెట్టారని, పులిచింతలపైసమావేశం నిర్వహించ తలపెట్టినవిద్యావేత్తలను తరిమి కొట్టారనివరవరరావు వివరిస్తూ భిన్నమైనఅభిప్రాయం ఉండకూడదా అని అడిగారు.చర్చలకు ఆటంకం కలిగించే పద్ధతిలోపోలీసులు వ్యవహరిస్తున్నారనిచంద్రన్న విమర్శించారు. పోలీసులచర్యలు చర్చలకు ఆటంకం కలిగిస్తాయనిఆయన అన్నారు.











Click it and Unblock the Notifications
