ప్రముఖనక్సలైట్ నాగరాజు లొంగుబాటు
విశాఖపట్నం:బోగస్ డాటా ఎంట్రీ సంస్థ యజమానిసునీతను పోలీసులు గురువారం అరెస్టుచేశారు. రెండు వందలనిరుద్యోగులకు విశాఖపట్నంలోని డికెయంసంస్థ టోపీ పెట్టింది. లాగ్ సంచార్ అనేకంప్యూటర్ సంస్థ మోసం బట్టబయలైనాలుగైదు రోజులు కూడా గడవక ముందేమరో సంస్థ మోసం విశాఖపట్నంలో బయటపడడం కలవర పరుస్తోంది.
డికెయంసంస్థ డాటా ఎంట్రీ, డాటా కలెక్షన్,ఇంటర్నెట్ వర్క్ పేర రెండు వందలమంది నుంచి ఆరు వేల రూపాయల చోప్పునపన్నెండు లక్షల రూపాయలు నాన్‌రిఫండెబుల్ డిపాజిట్‌గా వసూలు చేసింది.డాటా వర్క్‌కు సంబంధించిన సిడీలంటూపనికి రాని సీడీలను వారికిచ్చి మోసంచేసింది. సిడీలను తాము పరిశీలించామని,అందులో పనికొచ్చే విషయం ఏదీ లేదని,పనికొచ్చేది, సక్రమమైంది అయితే ఒకపద్ధతి ప్రకారం సిడీలో విషయంఉంటుందని పోలీసు కమీషనర్‌ప్రసాదరావు విలేకరులతో చెప్పారు. ఈమోసం వెనక ఉన్న ఘరానా వ్యక్తులకోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.











Click it and Unblock the Notifications
