జైలులో జయేంద్ర:బెయిల్‌పై రేపు నిర్ణయం

చెన్నై:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతిని వేలూరు జైలుకుతరలించారు. ఆయనను వేలూరుజైలులో వెయిటింగ్‌ రూమ్‌లోనే ఉంచారు.జయేంద్ర సరస్వతి బెయిల్‌పిటిషన్‌పై విచారణను మద్రాసుహైకోర్టు రేపటికి (శనివారానికి)వాయిదా వేసింది. ఆరోగ్యకారణాల రీత్యాఆస్పత్రిలో చికిత్స పొందడానికి జయేంద్రసరస్వతిని అనుమతించాలని ఆయనతరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టుతిరస్కరించింది. ఒక హత్య కేసులో తమిళనాడు పోలీసులుగురువారం రాత్రి జయేంద్ర సరస్వతినిఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లోఅరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయననునేరుగా హైదరాబాద్‌ తీసుకొచ్చివిమానంలో చెన్నైకితీసికెళ్లారు.

జయేంద్రసరస్వతిని తమిళనాడు పోలీసులుశుక్రవారంనాడు కాంచీపురం మెజిప్ట్రేట్‌ముందు హాజరు పరిచారు. ఆయనకుపదిహేను రోజుల పాటు జ్యుడిష్యల్‌ రిమాండ్‌విధిస్తూ మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.దాంతో ఆయనను వేలూరు జైలుకుతరలించారు. అయితే జైలు గదిలోఆయనను ఉంచడానికి పోలీసులుభయపడుతున్నారు. ఆ కారణంగాఆయన వెయిటింగ్‌ రూమ్‌లోనే ఉన్నారు.ఏదైనా శంకరమఠంలో గృహంనిర్బంధం చేయాలా అనే ఆలోచనలోపోలీసులు ఉన్నారు.చెన్నైనుంచి జయేంద్ర సరస్వతిని డెబ్బైకిలోమీటర్ల దూరం గల కాంచీపురానికితీసుకొచ్చి ఫస్టు క్లాస్‌ జ్యుడిష్యల్‌ మెజిస్ట్రేట్‌ జి.ఉత్తమ్‌రాజ్‌ ముందు శుక్రవారంఉదయం ఆరున్నర గంటలకు హాజరుపరిచారు. గంట విచారణ తర్వాతజయేంద్ర సరస్వతిని ఈ నెల ఇరవై ఆరవతేదీ వరకు రిమాండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం పోలీసు కాన్వాయ్‌లోవేలూరు కేంద్ర కారాగారానికితరలించారు. మీనంబాకంవిమానాశ్రయంలో అంతకు ముందుపెద్ద యెత్తున పోలీసు అధికారులు,మీడియా ప్రతినిధులు, కొంత మందిభక్తులు గుమికూడారు. కాంచీపురంలోనివరదరాజ పెరుమాళ్‌ దేవాలయంమేనేజర్‌ శంకరరామన్‌ హత్యకేసులో జయేంద్ర సరస్వతిని పోలీసులుఅరెస్టు చేశారు ఈ హత్య సెప్టెంబర్‌మూడవ తేదీన జరిగింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+