అరెస్టుకాంగ్రెస్ ప్రభుత్వాల కుట్ర: తొగాడియా
కేంద్రప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్,కర్ణాటక ప్రభుత్వాలు జయేంద్ర సరస్వతిఅరెస్టుకు తమిళనాడు ప్రభుత్వంపైఒత్తిడి తెచ్చాయని ఆయన విమర్శించారు.జయేంద్ర సరస్వతి అరెస్టుతో దీపావళినిరసన దినంగా మారిందని ఆయనవ్యాఖ్యానించారు. దీపావళి రోజు జయేంద్రసరస్వతిని అరెస్టు చేయడంహిందువులను అవమానించడమేననిఆయన అన్నారు. ఎన్నో కేసులుపెండింగ్‌లో ఉన్నప్పటికీ ఈద్ రోజు జమామసీద్ ఇమామ్ బుఖారిని అరెస్టుచేయగలరా అని ఆయన అడిగారు.ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చేప్రభుత్వం దీపావళి రోజున జయేంద్రసరస్వతిని అరెస్టు చేయడంహిందువులను అవమానించడమేననిఆయన అన్నారు.ఒకశంకరాచార్యను అరెస్టు చేయడంహిందూ చరిత్రలో ఇదే ప్రథమమని,త్రికాల్ పూజ చేస్తుండగా అకస్మాత్తుగాశంకరాచార్యను ఎందుకు అరెస్టుచేయాల్సి వచ్చిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలురాజకీయ కక్ష సాధింపు చర్యలోభాగంగానే జయేంద్ర సరస్వతి అరెస్టుజరిగిందని ఆయన ఆరోపించారు. నాలుగు నెలలక్రితం హత్య కేసులో జయేంద్రసరస్వతిని దీపావళి రోజునే అరెస్టుచేయడం అనేక అనుమానాలకు తావుఇస్తోందని ఆయన అన్నారు. జయేంద్రసరస్వతి అరెస్టు హిందూ వ్యతిరేకచర్య అని ఆయన అన్నారు.జయేంద్రసరస్వతిని అరెస్టు చేసినందుకుతమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వాలు హిందువులకు క్షమాపణచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.జయేంద్ర సరస్వతిని వెంటనే విడుదలచేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.అరెస్టుకు నిరసనగా రెండు రోజుల పాటుదేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలునిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.దీపావళి రోజున రాజకీయ నాయకులుమందిరాల్లో ప్రవేశించకుండా అడ్డుకోవాలనిఆయన అర్చకులను కోరారు.












Click it and Unblock the Notifications
