తెలంగాణకోసమే బాంబు పేలుళ్లు: ఇన్నయ్య
హైదరాబాద్:తెలంగాణ సాధన కోసమేహైదరాబాద్‌లో వరుస బాంబుపేలుళ్లకు పాల్పడినట్లు అరెస్టయినఇన్నయ్య చెప్పారు. వరుస బాంబుపేలుళ్ల వెనక ఉన్న ప్రధానసూత్రధారి హరిని ఇన్నయ్యగా పోలీసులుగుర్తించారు. ఇన్నయ్యతో పాటు మరోముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.తెలంగాణ లిబరేషన్ ఫోర్స్ నాయకుడుఇన్నయ్య, నిర్మల, మాధవ్,మల్లారెడ్డి అరెస్టయినవారిలోఉన్నారు.
వరుసబాంబు పేలుళ్లకు పాల్పడిన మరోఆరుగురిని పోలీసులు గుర్తించారు. వీరిలోఇద్దరు పరారీలో ఉన్నారు. వీరునాగాపూర్‌లోని షోలాపూర్ ఎక్ప్‌ప్లోజివ్ నుంచిపేలుడు పదార్థాలను సమకూర్చునట్లుపోలీసులు చెబుతున్నారు. కూకట్‌పల్లి,కొత్తపేటలలో ఖాళీ బస్సులలో, డిజిపికార్యాలయం సమీపంలోని చెట్టు తొర్రలలోవీరు బాంబులు పేల్చారు. మంజీరాపైప్‌లైన్‌ను కూడా పేల్చివేశారు. మరిన్నిపేలుళ్లకు పాల్పడడానికి బకెట్‌లోసిద్ధంగా వుంచుకున్న పేలుడుపదార్థాలను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. తమకార్యక్రమాల గురించి తెలంగాణలిబరేషన్ ఫోర్స్ పేర ఒక పత్రికాప్రకటన తయారు చేశారని, దాన్నిఎవరూ ప్రచురించకపోవడంతోవిధ్వంసక కార్యక్రమాల ద్వారా ఉనికినిచాటుకోవాలని అనుకున్నారని సైబరాబాద్‌పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డివిలేకరులకు చెప్పారు.తెలంగాణసాధన కోసం మానవ నష్టంజరగకుండా విధ్వంసక కార్యక్రమాలుచేపట్టాలని తాము నిర్ణయించుకున్నామనిఇన్నయ్య చెప్పారు. మేధావుల,జర్నలిస్టుల తదితరుల సలహాల మేరకుతాము ప్రతిఘటనా కార్యక్రమాలు చేపట్టాలనిమూడు నెలల క్రితం నిర్ణయంతీసుకున్నామని ఆయన చెప్పారు.











Click it and Unblock the Notifications
