వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రఅరెస్టుతో నాకేం సంబంధం?: పియం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి అరెస్టు వెనక తనహస్తం లేదని ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ స్పష్టం చేశారు.రంగారెడ్డి జిల్లా ఆలూరులో జాతీయ పనికిఆహారం పథకాన్ని ప్రారంభించినఅనంతరం ఆయన ఆదివారంసాయంత్రం రాజభవన్‌లో మీడియాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.జయేంద్ర సరస్వతి అరెస్టుతో కేంద్రప్రభుత్వానికి ఏ విధమైన సంబంధంలేదని ఆయన అన్నారు. జయేంద్రసరస్వతి అరెస్టు వెనక కేంద్రప్రభుత్వ హస్తం ఉన్నదనేవిమర్శలను ఆయన ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనక్సలైట్ల చర్చల విషయాన్ని రాష్ట్రప్రభుత్వం చూసుకుంటుందని ఆయనచెప్పారు. అయితే చర్చలను కేంద్రప్రభుత్వం పట్టించుకోవడం లేదనేమాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు.నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాలకార్యక్రమాలను తాము సమన్వయంచేస్తున్నామని ఆయన చెప్పారు.ఆయుధాలు వదిలేయాలని, చందాలు వసూలుచేయకూడదనే షరతులపై నాగాతీవ్రవాదులతో చర్చలుజరుపుతున్నామని, నక్సల్స్‌తో చర్చలవిషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంచూసుకుంటుందని ఆయన అన్నారు.విదేశీరుణాలు తెస్తే తప్పు లేదని, అయితేవాటి ఉపయోగం ఎలా జరుగుతుందనేదిముఖ్యమని, నీటి పారుదల ప్రాజెక్టులు,విద్యుచ్ఛక్తి, మౌలిక సదుపాయాలకల్పన వంటివాటికి వాటిని ఖర్చుచేయాలని ఆయన అన్నారు.జమ్మూకాశ్మీర్‌ సమస్య పరిష్కారంలో మూడో పార్టీమధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమని, ఈసమస్యను పాకిస్థాన్‌, భారత్‌పరిష్కరించుకోగలవని ఆయన అన్నారు.అమెరికా జోక్యంపై పాకిస్థాన్‌అధ్యక్షుడు ముషారఫ్‌ చేసినప్రకటనను ఒక విలేకరి ప్రస్తావించగాఆయన ఆ విధంగా సమాధానమిచ్చారు.చొరబాట్లు తగ్గిపోవడం వల్లసరిహద్దులో బలగాలను మోహరింపునుతగ్గించామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X