ఎపి సాగునీటిప్రాజెక్టులకు తోడ్పాటు: పియం
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో నదీ జలాల సక్రమవినియోగానికి రాష్ట్ర ప్రభుత్వంచేపడుతున్న కార్యక్రమాలకుకేంద్రం సంపూర్ణ సహకారాలుఅందిస్తుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారు. పనికి ఆహారం పథకాన్నిఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాలోనిఆలూరు గ్రామంలో ప్రారంభించారు. సాగునీటిప్రాజెక్టులకు అవసరమైన నిధులనుసమకూరుస్తామని కూడా ఆయనచెప్పారు.
తానుఆరు నెలల కాలంలో రెండుసార్లుఆంధ్రప్రదేశ్‌కు వచ్చానని, తానుసోనియా గాంధీ సందేశాన్ని తీసుకొనివచ్చానని, గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని,వారికి సహాయ సకారాలు అందించాలని సోనియాచెప్పారని ఆయన అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో బాలబాలికలందరూబడులకు వెళ్లే స్థితి రావాలని, ఏ ఒక్కరుకూడా బడికి దూరం ఉండకూడదనేదితమ అభిమతమని ఆయన అన్నారు.మెరుగైన సమాజం కోసం శాంతా సిన్హాచేసిన కృషి చూసి తనకు ఆనందంవేసిందని ఆయన అన్నారు.దేశంలోప్రతి ఒక్కరికీ తినడానికి, ఉండడానికి గూడు,కట్టుకోవడానికి బట్ట ఉండాలని గాంధీజీ కలలుకన్నారని, ఆ కలలను సాకారంచేయడానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందని ఆయన అన్నారు. పిల్లలకుపంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకుతాము కృషి చేస్తామని ఆయనచెప్పారు.గ్రామీణప్రాంతాల వికాసానికి తాము కృషిచేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని,పేదరికాన్ని పారదోలి వలసలను అరికట్టేప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.ఇందుకు పంచాయతీ రాజ్ సంస్థలు తోడ్పాటుఅందించాలని ఆయన అన్నారు. పనికి ఆహారంపథకం వంటి కార్యక్రమాల ద్వారాగ్రామీణ ప్రాంతాలు స్వావలంబనసాధించడానికి చర్యలు తీసుకుంటామనిఆయన హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌సుశీల్ కుమార్ షిండే, ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి,కేంద్ర మంత్రులు రఘువంశప్రసాద్, దాసరి నారాయణ రావు, ఎస్.జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎం. చంద్రశేఖర్‌తదితరులు పాల్గొన్నారు.











Click it and Unblock the Notifications
