ఆడపిల్లలకు వినూత్న కార్యక్రమం:వైయస్
హైదరాబాద్:రాష్ట్రంలోని ఆడపిల్లల సంక్షేమానికిప్రభుత్వం ఒక వినూత్నకార్యక్రమాన్ని అమలు చేసే ఆలోచనలోఉన్నదని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు.హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలోజవహర్‌లాల్ నెహ్రూ జయంతిసందర్భంగా ఆదివారం జరిగిన బాలలదినోత్సవంలో ఆయన వివిధ రంగాల్లోప్రతిభ కనబరిచిన పిల్లలకు అవార్డులుఅందజేశారు.
ఆడపిల్లలచదువు బాధ్యతను ప్రభుత్వంచేపట్టే ఆలోచనలో ఉందని, ప్రమాదంలోమరణించినవారి పిల్లల చదువులబాధ్యతను కూడా ప్రభుత్వంచేపడుతుందని, ఇందుకు ఒక బీమాపథకాన్ని అమలు చేస్తామని ఆయనవివరించారు. పిల్లలకు విద్యనుఅందించడం, నూటికి నూరు శాతంమంది చదువుకోవడానికి వీలుకల్పించడం ప్రభుత్వ ప్రధానకర్తవ్యమని ఆయన అన్నారు.పేదరికం పిల్లల చదువులకు అడ్డురాకుండా తగిన పథకాన్ని అమలుచేస్తామని, ధనవంతుల పిల్లలతోసమానంగా పేదల పిల్లలుచదువుకునే ఏర్పాటు చేస్తామని ఆయనఅన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖమంత్రి ఎన్. రాజ్యలక్ష్మి కూడాపాల్గొన్నారు.











Click it and Unblock the Notifications
